CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నవంబర్ 14, 15 తేదీలలో విశాఖపట్నం వేదికగా నిర్వహించే ప్రతిష్టాత్మకమైన సీఐఐ సదస్సును విజయవంతం చేయాలని స్పష్టం చేశారు . ఆదివారం వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సదస్సుకు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు పరోక్షంగా. ఇదిలా ఉండగా వరుసగా విశాఖలో నాలుగోసారి పెట్టుబడులపై సదస్సు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం. భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఇప్పటికే దేశ విదేశాల్లోని వివిధ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించడం జరిగిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Clear Instructions
ఏపీతో పాటు దేశ, విదేశాలలోని పెట్టుబడిదారులంతా విధిగా విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని కోరారు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు కూడా పంపించామన్నారు. ఐటీ, లాజిస్టిక్, తదితర రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఆహ్వానాలు పంపించే బాధ్యతను ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్నారని చెప్పారు. దావోస్ తరహాలోనే ఈ పెట్టుబడుల సదస్సు నిర్వహించాలని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. భాగస్వామ్య సదస్సుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలసీ మేకర్లను కూడా ఆహ్వానించాలని సూచించారు. కేవలం పెట్టుబడుల కోసమే కాకుండా నాలెడ్జి షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ లాంటి రంగాల్లో విధానాలపై చర్చించే అవకాశం ఉంటుందన్నారు.
Also Read : IND vs AUS 1st ODI Sensational : నిరాశ పరిచిన శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ

















