CM Chandrababu : అనంతపురం జిల్లా : రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరు ఆటంకం కలిగించినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). కొందరు రఫా రఫా అంటున్నారని కానీ వారికి తన సంగతి ఇంకా తెలియదన్నారు. ఏదో ఒక రోజు ఎవరైనా సరే గీత దాటితే వేటు వేస్తామన్నారు. కంట్రోల్ తప్పితే చర్యలు తప్పవన్నారు. వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని, నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇంకోసారి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. బుధవారం కూటమి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ బంపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ చేపట్టారు .ఈ సందర్బంగా చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడారు.
CM Chandrababu Warning
ఈ విజయోవత్సవ సభకు అశేషంగా వచ్చిన తరలి వచ్చిన మూడు పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యేందుకు అండగా నిలిచిన అన్నదాతకు, స్త్రీశక్తులకు, యువకిషోరాలకు వందనం అన్నారు. ఈ సభ రాజకీయాల కోసం, ఎన్నికల కోసం ఓట్ల కోసం కాదన్నారు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ సభ నిర్వహించడం జరిగిందని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాం అన్నారు.
నేపాల్ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయని, అక్కడ మన తెలుగువాళ్లు 215 మంది చిక్కుకు పోయారని, వారిని స్వస్థలాలకు తిరిగి తీసుకు రావడానికి మంత్రి లోకేష్ కి బాధ్యతలు అప్పగించాం అన్నారు సీఎం. రియల్ టైమ్ గవర్నెన్సులో ప్రతీ క్షణం సమీక్షిస్తూ చిక్కుకు పోయిన వారిని వెనక్కు రప్పించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, మరింత బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయడం అన్నారు. 57 శాతం మంది ప్రజలు ఓట్లేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారన్నారు.
గత పాలకులు అవినీతి అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు.పెట్టుబడుల్ని తరిమేసి పరిశ్రమలు రాకుండా చేశారని వాపోయారు.
Also Read : Deputy CM Pawan-Super Six Success : పార్టీలు వేరైనా విజయం సాధించాం : పవన్ కళ్యాణ్
