CM Chandrababu : సింగపూర్ – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రతి దేశ రాజధానిలో ఉండాలని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఆయన సింగపూర్ దేశంలో పర్యటిస్తున్నారు. తెలుగువారితో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఏపీలో వెంకన్న ఉండడం మన అదృష్టం అన్నారు. ఎన్ని కష్టాలున్నా వేంకటేశ్వర స్వామిని తలుచుకుని సంకల్పం తీసుకుంటే సమస్య పరిష్కారమై పని అయిపోతుందన్నారు. ఎన్నారైలకు తిరుమల వెంకన్న దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు .
CM Chandrababu – Singapore TTD Temples
ప్రతి దేశ రాజధానిలో వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉండాలన్నదే తన సంక్పలమన్నారు. ఇందు కోసం తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు. సింగపూర్ నుంచి ఏపీలోని విజయవాడ, విశాఖ, తిరుపతికి నేరుగా విమానాలు వచ్చేలా చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు. సింగపూర్ లో బెంగాలీ, హిందీ, తమిళ్ రెండో భాషగా ఉన్నాయని గుర్తు చేశారు. తెలుగు కూడా రెండో భాషగా పెట్టాలని కోరుతున్నానని అని చెప్పారు. ఇక్కడే ఉన్న భారత హైకమిషనర్ ఈ మేరకు చొరవ తీసుకోవాలని కోరుతున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రపంచంలో ఏ దేవాలయానికి లేనంతటి ఆదాయం, ఆదరణ ఒక్క తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఉందన్నారు. తాము వచ్చాక ఆలయానికి పూర్వ వైభవం తీసుకు వచ్చామన్నారు.
Also Read : CM Chandrababu Interesting on Singapore : నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం సింగపూర్
















