CM Chandrababu : అమరావతి – బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం జరగదని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వృథా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే మా ఉద్దేశం తప్ప మరోటి కాదన్నారు. ప్రతి ఏటా సగటున 2 వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని తెలిపారు. అవి వృథాగా వెళ్లకుండా బనకచర్ల ప్రాజెక్టుకు వాడుకునేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే తాను ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదన్నారు.
CM Chandrababu Comments on Banakacherla Project
గురువారం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రతి ఏటా 2 వేలకు పైగా టీఎంసీల నీళ్లు వాడు కోవడం లేదన్నారు. ఈ సమయంలో వాటిని వాడుకునేందుకు తాము బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే ఆమోదం కోసం కేంద్రానికి డీపీఆర్ సమర్పించడం జరిగిందన్నారు. పనిగట్టుకుని ఏపీకి నీళ్లు రాకుండా చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
తనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివని స్పష్టం చేశారు. తన వల్లనే తెలంగాణ అభివృద్ది జరిగిందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తన వల్లనే వచ్చిందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా బనకచర్ల పై సంచలన కామెంట్స్ చేశారు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి. ఆంద్రోళ్లు మంచిగా చెబితే వినరని వాళ్లు ఉంటున్న నివాసాలకు కరెంట్, నీళ్లు కట్ చేయాలని అన్నారు. చంద్రబాబు బినామీలే ఇక్కడ కాంట్రాక్టులు పొందారంటూ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
Also Read : CM Chandrababu Strong Commitment : ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం – సీఎం


















