అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు విద్యా రంగంపై. ప్రధానంగా కాలేజీ విద్యను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాలేజీ విద్యను రీ-ఓరియేంటేషన్ చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు అధ్యయనం చేయాలనని, యూనివర్శిటీలతో నిత్యం అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ట్రెడిషన్ కోర్సులతో పాటు… డిమాండ్ ఉన్న కోర్సులను, కొత్త కరిక్యులంను ప్రవేశ పెట్టేలా కసరత్తు చేయాలని ఆదేశించారు సీఎం. ఈ మేరకు కరికుల్యంను రీ-స్ట్రక్చర్ చేసేలా చూడాలన్నారు. అలాగే యూనివర్శిటీల ర్యాంకింగులు కూడా మరింతగా పెరగాల్సి ఉందన్నారు.. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీతోపాటు… మిగిలిన యూనివర్శిటీలు కూడా ర్యాంకింగులను మరింతగా పెంచుకోవాల్సి ఉందన్నారు.
ఇదే సందర్భంగా హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ కూడా మరింత యాక్టివ్‌గా ఉండాలన్నారు. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు కానీ… విమర్శలు కానీ రాకూడదన్నారు. శాప్ విభాగం తన యాక్టివిటీని మరింత పెంచుకోవాలని అన్నారు. 5కే రన్ వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజల్లో, యువతలో ఆరోగ్య రక్షణ పట్ల అవగాహన కల్పించేలా శాప్ చర్యలు చేపట్టేలా శాప్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాలి. ట్రిపుల్ రైడింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు.. మరణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
