CM Chandrababu : అమరావతి : మొంథా తుఫాన్‌ను టీమ్ స్పిరిట్‌తో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపైనా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). శనివారం క్యాంపు కార్యాలయంలో మొంథా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన 137 మందికి మెమొంటోలు, సర్టిఫికెట్లను సీఎం అందించారు. ప్రతీ సంక్షోభం మనకు ఒక అవకాశంగా చూడాలన్నారు . ఈ సారి తుఫాన్ నష్టాన్ని మీ అందరి సహకారం, కృషితో నివారించడం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు. ప్రతీ ఒక్కరికీ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియ జేస్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అద్భతంగా పనిచేశారని కితాబిచ్చారు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్‌గా రూపొందిద్దామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయ పరుచుకుంటూ ముందుకెళ్తుందనే దానికి ఫలితంగానే మొంథా తుఫాన్ నష్టాన్ని తగ్గించ గలిగామని చెప్పారు.
CM Chandrababu Appreciates Cyclone Warriors
రాష్ట్రానికి రెండు సమస్యలు ఉన్నాయని అన్నారు. ఒకటి రాయలసీమకు కరువు, రెండోది కోస్తాంధ్రకు తుఫాన్లు. సమర్ధ నీటి నిర్వహణతో, ప్రాజెక్టుల నిర్మాణంతో ఈరోజు రాయలసీమలో కరువు అనేది లేకుండా చేశామన్నారు సీఎం. గతంలో హరికేన్ వచ్చిందని, ఉభయ గోదావరి జిల్లాల్లో అప్పుడు వారం నుంచి 10 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకు రాగలిగామని గుర్తు చేశారు సీఎం. ఈసారి మొంథా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రతిభ కనబరిచే అధికారులతో ఒక టీమ్‌ను సిద్ధం చేశామని చెప్పారు. వారంతా అద్భుతంగా పనిచేశారు. వారికి టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ద్వారా తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం అని అన్నారు. మోనిటరింగ్, అలెర్ట్ మెకానిజం, రెస్క్యూ మెకానిజం, రిహాబిలిటేషన్, నార్మల్సీ ఇలా 5 పాయింట్ ఫార్ములా అనుసరించి నష్టాన్ని తగ్గించామని తెలిపారు సీఎం.
Also Read : Hydraa Shocking : మియాపూర్ లో 5 అంతస్తుల భవనం కూల్చివేత

















