CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే ఉన్నాయన్నారు. హైటెక్ సిటి రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేదన్నారు. కానీ తాను ఆనాడు ఎప్పుడైతే అభివృద్ది చేయడం ప్రారంభించానో ఇప్పుడు అక్కడ ఉన్న భూముల ధరలు ఆకాశానికి అంటుతున్నాయని, ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందని, అది నా వల్లనే జరిగిందని చెప్పారు సీఎం. పరిశ్రమలు, అభివృద్ధితో భూమి విలువ పెరుగుతుందని అన్నారు. ఆరు నూరైనా సరే అమరావతి రైతులకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు.
AP CM Chandrababu Key Comments Hyderabad
అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుందని, ఆగి పోయేది కాదన్నారు. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలి పోతుందన్నారు. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహా నగరంగా మారుతుందన్నారు. గుంటూరు-విజయవాడ-తెనాలి-గ్రామాలు కలిస్తేనే మహా నగరంగా మారి పోతుందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. భూములిచ్చిన వారిని ఆదుకుంటామని పేర్కొన్నారు. విస్తరణ విషయంలోనూ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరి పోతుందన్నారు.. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
Also Read : AP Rains Sensational : ఏపీలో కొనసాగుతున్న వర్షాలు

















