CM Chandrababu : విశాఖపట్నం – హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్కే బీచ్ నుంచి తొట్ల కొండ వరకూ బీచ్ రోడ్ లో పర్యాటక బస్సులు నడుస్తాయి. విశాఖ బీచ్ రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరగనున్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు . ఈ బస్సులో ప్రజాప్రతినిధులతో కలిసి ప్రయాణించారు చద్రబాబు నాయుడు (CM Chandrababu). ఆర్కే బీచ్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా జర్నీ చేశారు. ఈ సందర్బంగా పర్యాటకులకు అభివాదం చేశారు. 24 గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని రూ.500 పెట్టారని తెలిపారు.
CM Chandrababu Key Comments
అయితే పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. రూ.250 రూపాయలకే 24 గంటల పాటు టికెట్టును వర్తింప చేసేలా ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులంతా పర్యావరణ హితంగా వ్యవహరించాలి. మన తీరప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా ఈ బీచ్ లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలని కోరారు. విశాఖను రాజధాని చేస్తామని గత పాలకులు చెబితే అవసరం లేదని మీరు తీర్పు ఇచ్చారన్నారు. రోడ్లపై గుంతలు పెట్టిన పాలకులు వాటిల్లోనే కొట్టుకు పోయారని ఎద్దేవా చేశారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్ గా ఎదగబోతోందని చెప్పారు.
విశాఖలో డేటా సెంటర్, సీ కేబుల్ వేస్తారు. ఈ కేబుల్ ద్వారా విశాఖతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందన్నారు. భారత్ కే టెక్నాలజీ హబ్ గా విశాఖ ఎదుగుతుందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖ ఎంపికైందన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాలతో పోటీ పడుతోందన్నారు.
Also Read : Huge Rains – SCR Announced : పలు రైళ్ల రాక పోకలకు అంతరాయం


















