CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆసక్తికర ట్వీట్ చేశారు. బుధవారం ఆయన ఎక్స్ సామాజిక వేదికగా ఆయన షేర్ చేసిన గూగుల్ పోస్టర్ వైరల్ గా మారింది. గూగుల్ పెట్టుబడులపై ఆకట్టుకునేలా ఉంది. వైజాగ్ పేరులో గూగుల్ లోగో ప్రతిబింబించేలా డిజైన్ చేశారు పోస్టర్ ను. VIZAG లోని G ప్లేస్‌లో google లోగోను చేర్చి సముద్ర తీరాన్ని బ్యాక్ గ్రౌండ్‌లో ఉంచి పోస్టర్ విడుదల చేయడం పట్ల సర్వత్రా హర్షం, ఆనందం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా దేశంలోనే తొలిసారిగా ఏపీలో 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టుబడి పెట్టింది. యావత్ దేశం చూపు వైజాగ్ వైపు చూసేలా చేసింది. దీనిని ప్రతిబింబించేలా వైజాగ్‌కు గూగుల్ అంటూ వైజాగ్ పేరును, గూగుల్ లోగోను పోస్ట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
CM Chandrababu Vizag Logo with Google Viral
కేంద్ర సహకారంతో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రానికి పెద్దఎత్తున లాభం చేకూరుతోందని అన్నారు. ఏపీలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో నిన్న గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, ఇది చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. 1998లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రాకతో ఐటీ ఎకో సిస్టం ఏర్పడిందన్నారు. నాలెడ్జి ఎకనామీకి పునాది పడిందన్నారు. గూగుల్ డేటా హబ్ రావటంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ చొరవ ఉందనన్నారు. ఐటీ మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ ప్రతినిధులతో సంప్రదించి రాష్ట్రానికి వచ్చేలా చేశారని అన్నారు. దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని స్పష్టం చేశారు సీఎం.
Also Read : Apple Strong Request : భారత్‌లో పన్ను చట్ట సవరణ కోరుతున్న ఆపిల్ – విస్తరణకు కీలక అడుగు
















