CM Chandrababu : అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత సర్కార్ సాగు రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రైతులను మోసం చేసిందని వాపోయారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకువచ్చామని చెప్పారు.. రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు సీఎం. అమెరికా పెంచిన టారిఫ్ వలన ఆక్వా రైతులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. దీనిపై ఆక్వా రైతులతో చర్చించి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేయడానికి నదులు అనుసంధానం చేస్తామన్నారు.
CM Chandrababu Key Comments
గత ప్రభుత్వంలో ఉచిత బీమా చేయకుండా నాశనం చేశారని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). ఉచిత బీమా ప్రవేశపెట్టింది ఎన్డీఏ సర్కార్ అన్నారు. శనివారం దర్శి మండలం వీరాయపాలెంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు ముఖ్యమంత్రి. అంతకు ముందు ఆయన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ప్రారంభించారు. అన్నదాత సుఖీభవతో ఏపీలోని 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. మొదటి విడతలో రైతుల ఖాతాల్లో రూ.7 వేలు చొప్పున జమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.2342.92 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.7 వేలు బదిలీ చేశామన్నారు.
Also Read : Chinta Mohan Fired on Modi Govt : పార్లమెంట్ లోకి ఖాకీల ప్రవేశం దారుణం – చింతా మోహన్
















