CM Chandrababu : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు రానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. ఈ సంఖ్య 32కి పెరిగే ఛాన్స్ ఉంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచన చేస్తున్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశంలోకి కలుపుతారు. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పాలనా సౌలభ్యంపై ప్రభుత్వం దృష్టి సారించనున్నారు.
CM Chandrababu New Thoughts
ఈ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై దృష్టి సారించిన ఆయన రాష్ట్ర సచివాలయంలో మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో, చంద్రబాబు నాయుడు అనేక ప్రాంతాలలో కొత్త జిల్లా ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంలో, ముఖ్యమంత్రి అధికారులను కూటమి ఇచ్చిన హామీలకు సంబంధించి వెంటనే నివేదికను సమర్పించాలని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు వివిధ సమాజ ప్రతినిధులతో సంప్రదించి నివేదికను తయారు చేయాలని ఆయన పేర్కొన్నారు. మార్కాపురం చుట్టూ కేంద్రీకృతమై ప్రత్యేక జిల్లా ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురైన మండలాల సమస్యలను పరిష్కరించడం, ఇతర ప్రతిపాదిత ప్రత్యేక జిల్లాల ఏర్పాటు వంటి వాగ్దానాలపై చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
Also Read : PM Modi New Innovation : ఎంపీల ఫ్లాట్లు ప్రారంభానికి సిద్ధం


















