CM Chandrababu : అమరావతి : డబుల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రంలో అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). 15 నెలల కాలంలో ఇన్ని కార్యక్రమాలను చేయగలిగాం అన్నారు. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోందని చెప్పారు. ఈ టీంలో ఏ ఒక్కరు తప్పు చేసినా, విఘాతం కలిగించేలా వ్యవహరించినా, రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పర్సనల్ అజెండాలు పెట్టుకుని మాట్లాడితే తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి అడ్డంకి కలుగుతుందని పేర్కొన్నారు సీఎం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
CM Chandrababu Comments
అసెంబ్లీలో సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలుపై చర్చ జరిగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించనున్నట్టు సభలో సీఎం ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో కలిసి కట్టుగా పని చేయాలని ప్రజా ప్రతినిధులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయన్నారు. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తామని చెప్పామన్నారు. ఇవాళ ఆచరణలోచేసి చూపిస్తున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu).
అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఈ పథకం కింద సొంత వాహనం కలిగిన ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తామని తెలిపారు. ఈ పథకానికి అర్హులుగా 2,90,234 మంది డ్రైవర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఏదైనా కారణాలతో లబ్దిదారుల జాబితాలో అర్హులైన వారి పేరు లేకపోతే, వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తామని ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో స్కీంను వర్తింప చేస్తామని తెలిపారు. ఈ పథకానికి ప్రతి ఏటా రూ.435 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. గత ప్రభుత్వం రూ.12 వేలు మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం రూ.15 వేలు అందించేందుకు నిర్ణయించిందన్నారు సీఎం.
Also Read : DGP Venkataraman Shocking Comments : కరూర్ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు

















