CM Chandrababu : అమరావతి : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హృదయ విదారక ఘటనపై స్పందించారు. ఈ సందర్బంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరికి అత్యవసర వైద్య సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
CM Chandrababu Key Comments Kurnool Road Accident
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు నారా చంద్రబాబు నాయుడు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా కర్నూలు జిల్లా కలెక్టర్ రెండు కార్లు ఢీకొన్న ఘటనపై స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే ఆర్డీఓ అక్కడికి వెళ్లారు. క్షతగాత్రులను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లాకు చెందిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ , ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరారు.
Also Read : Veerappa Moily Warning : కర్ణాటక నాయకత్వ మార్పుపై తాత్సారం ప్రమాదం















