CM Chandrababu : అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. అన్ని రంగాలలో ఏపీని నెంబర్ వన్ గా తీర్చి దిద్దేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని చెప్పారు. 24 గంటల్లో తాను కేవలం 2 గంటలు మాత్రమే నిద్ర పోతున్నానని, మిగతా 22 గంటలు రాష్ట్రాభివృద్ది కోసం ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ప్రధానంగా ఏపీని ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, పర్యాటక రంగాలకు హబ్ గా తయారు చేయాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా రంగాలకు సంబంధించి ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసే పనిలో ఉన్నారని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Comments
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాలకు (ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వేలు, లోతట్టు జలమార్గాలు) కార్గో రవాణాను నిర్వహించడానికి లాజిస్టిక్స్ కార్పొరేషన్ నిర్మాణం చేపడతామన్నారు సీఎం. మచిలీపట్నం, మూలపేట, చినగంజాంలలో షిప్ బిల్డింగ్ యూనిట్లు నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా 20 ఓడ రేవులతో పాటు కొత్తగా ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు ప్లాన్ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇంటిగ్రేటెడ్ కార్గో హబ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. టౌన్ షిప్ ల కోసం పీపీపీ మోడల్ ను తయారు చేస్తామన్నారు .కుప్పం, దగదర్తిలలో ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.
Also Read : Haryana High Court Shocking Comments : ఆన్ లైన్ బెయిల్ ఆర్డర్ కాపీ సరిపోతుంది

















