CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంస్ఎంఈ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రైతులకు అత్యధిక ప్రయోజనం కల్పించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆ శాఖ మంత్రి శ్రీ కె.అచ్చెన్నాయుడు ఆన్ లైన్ లో పాల్గొన్నారు. వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి 29 తేదీ వరకూ అలాగే డిసెంబరు 3 తేదీన నిర్వహించనున్న రైతన్నా – మీ కోసం కార్యక్రమంలో తానూ పాల్గొంటానని సీఎం చంద్రబాబు నాయుఉ స్పష్టం చేశారు.
CM Chandrababu Comments
గృహ నిర్మాణ శాఖ, APTIDCO సంబంధిత అంశాలపై కూడా సమీక్ష చేపట్టారు. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయించిన ప్రభుత్వం రానున్న మూడేళ్లలోనూ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు . లబ్దిదారులు, పేదలు, అర్హులైన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు సీఎం. ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ దిశగా తాను ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు సీఎం. ఇదిలా ఉండగా వచ్చే మూడు ఏళ్లలో 17 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహ నిర్మాణ శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Hydraa Saved Huge Land Bank : రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా


















