CM Chandrababu : అమరావతి : కలెక్టర్లు, అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, ఇదే సమయంలో పని చేయాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). ఆఫీసులో కూర్చొని పేపర్ మీద చూస్తే అంతా చక్కగా ఉంటుందని, బాగుందని అనిపిస్తుందని, కానీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే అసలు వాస్తవాలు ఏమిటో తెలుస్తాయని అన్నారు. వాటిని గ్రహించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో జరిగిన కలెక్టర్లతో జరిగిన కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. తొలి రోజున వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాల్లో ప్రగతి, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించడంతో పాటు కేటగిరీల వారీగా శాఖలపై సీఎం సమీక్షించారు. లాజిస్టిక్స్, ఇన్ఫ్రా, స్వచ్ఛాంధ్ర, సర్కులర్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించారు. సూపర్ సిక్స్, పీ4 అమలు వంటి అంశాల అమలు ఏ విధంగా జరుగుతున్నాయోననే అంశాన్ని కలెక్టర్లకు వివరించారు.
CM Chandrababu Key Comments
నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. అలాగే జీఎస్డీపీ గ్రోత్ వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలన్నారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లకు ప్రజలు, కెేబినెట్ తరపున శుభాభినందనలు. కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులు అని స్పష్టం చేశారు. జిల్లా రూపు రేఖల్ని మార్చటంలో మీదే ప్రధాన బాధ్యత అన్నారు సీఎం. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసేది కలెక్టర్లేనని పేర్కొన్నారు. సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకూ సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియమాకాలు చేశామని ప్రకటించారు.
Also Read : DSC Final Selection List Interesting : డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల
















