CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో తన ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కీలకమైన అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్వచ్చంధంగా తమ భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు సీఎం. అంతకు ముందు ఆయన మంత్రివర్గంతో చర్చించారు. వారి అభిప్రాయాలను, సూచనలను స్వీకరించారు. రాజధాని విషయంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇదే క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు కోరుకున్న మేరకు తాము పరిహారం ఇస్తున్నామన్నారు.
CM Chandrababu Key Comments on Farmers
ఇంకో ఆసక్తికర ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు (CM Chandrababu). రాయలసీమను హార్టీకల్చర్ హబ్ చేసేందుకు కేంద్రం సహకరిస్తోందని చెప్పారు.’పూర్వోదయ ప్రాజెక్టు’ ద్వారా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధితో పాటు 2027 మే నాటికి పోలవరం పూర్తి చేయాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలవరం వద్ద ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, పాడేరు వైద్య కళాశాలలు త్వరగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
Also Read : Minister Savitha Important Update : ఒకే చోట చేనేత, జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు
















