CM Chandrababu : అమరావతి : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి రాబోయే రోజుల్లో దేశానికి రోల్ మోడల్ గా తయారు చేస్తామని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). శుక్రవారం అమరావతి లో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, నారా లోకేష్, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసిన వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరాబ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసీ, నాబార్డ్ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
CM Chandrababu Key Comments on AP Growth
ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఏపీ కూటమి సర్కార్ అన్ని రంగాలలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడం అభినందనీయమని అన్నారు. కేంద్ర సర్కార్ ఇతోధికంగా సాయం చేస్తోందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గూగుల్ ఐటీ సంస్థ ఏఐ డేటా సెంటర్ ను వైజాగ్ లో ఏర్పాటు చేసిందని చెప్పారు. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, తదితర రంగాలకు కేరాఫ్ గా ఏపీని మారుస్తామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. కేంద్రంలోని పీఎం మోదీ అందిస్తున్న సహకారం మరిచి పోలేమన్నారు.
Also Read : FM Nirmala Sitharaman Important Comments : ఆర్థిక కార్యకలాపాలకు అమరావతి కేరాఫ్
















