CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎంతో భేటీ అయ్యారు మంత్రులు వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు (CM Chandrababu). కందుకూరులో జరిగిన లక్ష్మీ నాయుడు హత్యను తీవ్రంగా ఖండించారు .ఈ ఘటన జరగడం అమానుషం, అమానవీయం అన్నారు సీఎం.
CM Chandrababu Strong Warning
లక్ష్మీ నాయుడు హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్ష పడాలని అన్నారు. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. చని పోయిన లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించారు సీఎం. భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం ఇస్తామన్నారు. ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాటిజ్ చేయాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని అన్నారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి.
Also Read : Harish Rao Fired on CM Revanth : రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి


















