CM Chandrababu : విశాఖపట్నం : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక ప్రకటన చేశారు. వ్యాపారం చేసే వారిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. మరో రెండేళ్లలో డ్రోన్ ట్యాక్సీలు కూడా వస్తాయని, అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సదస్సులో పాల్గొన్న వారంతా ఆక్వా ఫుడ్‌ను రుచి చూడాలని కోరారు. వ్యాపారం చేసే వారిని అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నామని, వచ్చాక 27 పాలసీలు తెచ్చామన్నారు. పెట్టుబడిదారులకు ఎస్క్రో అకౌంట్ ఇస్తామని, మరో మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది తమ లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీకి పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రావాలనేదే లక్ష్యం అని, గ్రీన్ ఎనర్జీ వినియోగం, స్వచ్ఛాంధ్ర దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఐటీలో మనవాళ్లే ముందున్నారని, ఏపీకి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయని చెప్పారు.
CM Chandrababu Key Update
సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో మన రాష్ట్రమే ముందుందని, రాష్ట్రాభివృద్ధిలో పర్యాటక రంగానిది కీలకపాత్ర కానుందని సీఎం అన్నారు. దేశానికి గేట్‌వేలా ఆంధ్రప్రదేశ్ ఉందని, పెట్టుబడిదారుల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మారుతోందన్నారు. మోదీ పాలనా సంస్కరణలను దేశ ప్రజలు నమ్మారని, ఆయన పరిపాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మోదీ ప్రభుత్వం గెలుస్తుందని, దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారని ప్రశంసించారు. 2047లోగా మనదేశం నెంబర్‌వన్ ఎకానమీ అవుతుందని, ప్రజలను, వనరులను, సాంకేతికతను సమర్థంగా వాడుకుంటే తిరుగు లేదన్నారు నారా చంద్రబాబు నాయుడు . ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూసే పరిస్థితి వచ్చిందని, పేదరికం, అసమానతలు రూపుమాపేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read : Vice President Radhakrishnan Shocking Comments : రాష్ట్ర విభజన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవేదన


















