ఎమ్మెల్యేల ప‌నితీరుపై చంద్ర‌బాబు గుస్సా

ప‌నితీరు మార్చుకోక పోతే ఎలా అని ఫైర్

hellotelugu-CM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ అయ్యారు. విజయనగరం జిల్లా నేతలతో అర్ధరాత్రి వరకూ సీఎం సమీక్ష కొనసాగింది. ఈ క్రమంలో సీఎం పలువురు నేతలు, కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి కొండపల్లిపై పనితీరు మెరుగు పడలేదని, అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు. పార్టీకి కంచుకోట వంటి జిల్లాలో ప్రగతి చూపాలని సూచించారు. 6 నెలలుగా ఏ వ్యవహారంలోనూ తన తండ్రి జోక్యం చేసుకోవట్లేదని కొండపల్లి తెలిపారు. ఏపీ లో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరి రెండేళ్లు పూర్తయినా ఇంకా మీ ప‌నితీరులో మార్పు రాక పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇక నుంచి బాధ్య‌తాయుతంగా మెల‌గాల‌ని, ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని దిశా నిర్దేశం చేశారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చి వెనుకబడటం ఏమిట‌ని ప్ర‌శ్నించారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇదే స‌మ‌యంలో ఎస్.కోట ఎమ్మెల్యేకు హితబోధ చేశారు. అందరితో సఖ్యతగా ముందుకు సాగాలని లోకం మాధవికి, పనితీరు మెరుగుప రుచుకోవాలని కళా, బేబీనాయనకు సీఎం సూచించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీ కలిశెట్టితో అన్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై సహా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను చట్టపరంగా ఎత్తివేయాలని సీఎం ఆదేశించారు.

Exit mobile version