హైదరాబాద్ : యావత్ ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోంది. ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ శనివారం ఇండియాలో కాలు మోపారు. ఆయన నేరుగా కోల్ కతాకు చేరుకున్నారు. అక్కడ ఉదయం 11.30 గంటలకు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ , భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అందరూ ప్రేమగా పిలుచుకునే దాదా అలియాస్ సౌరవ్ గంగూలీ. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున తరలి వచ్చారు అభిమానులు స్టేడియం వద్దకు మెస్సీని చూసేందుకు . తమ నుంచి పెద్ద ఎత్తున నిర్వాహకులు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆపై స్టేడియంలో ఉన్న కుర్చీలను విసిరి వేశారు.
ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెప్పారు. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. విచారణకు ఆదేశించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. రాత్రి 7.15 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ తో సీఎం రేవంత్ రెడ్డి టీంల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు నేరుగా కోల్ కతా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆయన రాక సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఇందు కోసం 3,000 వేల మందిని నియమించామన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ కు మెస్సీ, రాహుల్, సీఎం రేవంత్ చేరుకుంటారని తెలిపారు.


















