CIBIL Score Shocking : ఏంటి సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడం వల్ల ఉద్యోగం పోయింది.?

ఇది సివిల్ స్కోర్ కేవలం రుణాలకే పరిమితం కాదు, ఉద్యోగాల్లో కూడా కీలకంగా మారుతోందని స్పష్టం చేసింది...

Hello Telugu - CIBIL Score Shocking

Hello Telugu - CIBIL Score Shocking

CIBIL : సిబిల్ స్కోరు తక్కువగా ఉండటమే ఓ అభ్యర్థి ఉద్యోగాన్ని కోల్పోవడానికి కారణమైంది. భారతదేశ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకున్న ఈ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. ఇది సివిల్ స్కోర్ కేవలం రుణాలకే పరిమితం కాదు, ఉద్యోగాల్లో కూడా కీలకంగా మారుతోందని స్పష్టం చేసింది.

CIBIL Score Shocking

ఈ వ్యవహారం చెన్నై ఎస్‌బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) నియామకం సందర్భంగా వెలుగులోకి వచ్చింది. అభ్యర్థి పి. కార్తికేయన్ 2020లో ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకొని రాత పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధించాడు. మెడికల్ పరీక్షలు, సర్టిఫికేట్ ధృవీకరణల అనంతరం 2021 మార్చి 12న అతనికి నియామక పత్రం జారీ చేశారు.

అయితే, సిబిల్ (CIBIL) నివేదిక పరిశీలనలో అతనికి 2016–2021 మధ్య 9 క్రెడిట్ లావాదేవీలు, 10 కంటే ఎక్కువ రుణ దరఖాస్తులు ఉన్నట్లు తేలింది. అంతేకాదు, అనేక రుణాల్లో వాయిదాలు చెల్లించకపోవడం వల్ల అతని సిబిల్ స్కోరు గణనీయంగా తగ్గింది. దీనిని ఆధారంగా తీసుకున్న ఎస్‌బీఐ, నియామకాన్ని రద్దు చేసింది.

తనపై తీసుకున్న చర్యను రద్దు చేయాలంటూ కార్తికేయన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు, బ్యాంకింగ్ రంగం ప్రజా ధనంతో పని చేసే వ్యవస్థగా, ఉద్యోగుల్లో ఆర్థిక బాధ్యత గల వ్యక్తులే ఉండాలన్న నియమం ఉందని స్పష్టం చేసింది. కార్తికేయన్‌కు పదవిలో కొనసాగించే హక్కు లేదని కోర్టు తేల్చేసింది.

ఈ తీర్పుతో సిబిల్ స్కోరు ప్రాముఖ్యత మరోసారి రుజువైంది. కేవలం రుణాలు పొందడమే కాక, ఉద్యోగ అవకాశాలను కూడా ఇది ప్రభావితం చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read : Elon Musk Exclusive : జనాభా తగ్గుదలపై మళ్లీ ఆందోళన వ్యక్తం చేసిన ఎలాన్ మస్క్

Exit mobile version