Chitrangda Singh : ముంబై – ఎవరీ చిత్రాంగద సింగ్ అనుకుంటున్నారా. ఈ మధ్యన హాట్ టాపిక్ గా మారింది. కండల వీరుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఏరికోరి తనను ఎంచుకోవడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. 2020 గల్వాన్ వ్యాలీ ఘర్షణ ఆధారంగా అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ‘గాల్వాన్ యుద్ధం’ అనే పేరుతో సినిమా రాబోతోంది. ఇందు కోసం తనతో స్క్రీన్ షేర్ చేసేందుకు చిత్రాంగద సింగ్ (Chitrangda Singh) అయితేనే బావుంటుందని ప్రిఫెర్ చేయడం విస్తు పోయేలా చేసింది. ఎంతో మంది హీరోయిన్లు బాలీవుడ్ లో ఉన్నప్పటికీ ఖాన్ మాత్రం తన సరసన ఆమె అయితేనే బావుంటుందని సిఫార్సు చేయడంతో మూవీ మేకర్స్ తనను గాల్వాన్ కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.
Chitrangda Singh Movie With Salmaan Khan
ప్రస్తుతం గాల్వాన్ వార్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది దర్శకురాలు అపూర్వ లఖియా. చాలా కాలం నుంచి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కొంత ఆలస్యం కావడంతో వస్తుందా రాదా అన్న మీమాంసకు తెర దించే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా సల్మాన్ ఖాన్ తో తెర పంచు కోవడం తనకు ఎనలేని సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు నటి చిత్రాంగద సింగ్. తన జీవితంలో సల్మాన్ తో ఒక్క సినిమా అయినా చేయాలన్న కల ఉండేదని, అది అపూర్వ కారణంగా తీరి పోయిందని తెలిపింది. తనపై నమ్మకం ఉంచినందుకు చిత్రాంగద ప్రత్యేకంగా అపూర్వ లఖియాకు ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్ల కిందట మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ ఖాన్ తో కలిసి పని చేయాల్సి ఉండేది. కానీ అది ఆగి పోయింది. ఆ సమయంలో తప్పకుండా తదుపరి ప్రాజెక్టులో తీసుకుంటానని చెప్పాడని, ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డారంటూ ప్రశంసలు కురిపించింది సల్మాన్ ఖాన్ పై.
Also Read : Popular Choreographer Jani Master : ఈ సినిమా నెమ్మదిగా తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న జానీ మాస్టర్
