Hero Chiranjeevi – OG Movie : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీని చూసిన మెగాస్టార్

త‌న‌తో పాటు రామ్ చ‌చ‌ర‌ణ్ కూడా

Hello Telugu - Hero Chiranjeevi - OG Movie

Hello Telugu - Hero Chiranjeevi - OG Movie

Chiranjeevi : హైద‌రాబాద్ : టీజీ విశ్వ ప్ర‌సాద్ , టీజీ కృతి ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం దే కాల్ హిమ్ ఓజీ మూవీని మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని ప్ర‌సాద్ ల్యాబ్స్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , త‌న‌యుడు స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్, కుటుంబీకుల‌తో క‌లిసి వీక్షించారు. ఈ సంద‌ర్బంగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు. సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. దీనిని పూర్తిగా ఆస్వాదించాన‌ని పేర్కొన్నారు. హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా అద్భుతంగా నిర్మించారంటూ నిర్మాత‌ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు మెగాస్టార్. అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రంగా తెర‌కెక్కించిన తీరు త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని అన్నారు. ఓజీని సూప‌ర్ గా తీశాడంటూ యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ను ప్ర‌శంస‌లు కురిపించారు.

Chiranjeevi Watched OG Movie

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినీ కెరీర్ లో ఓజీ ఓ ప్ర‌త్యేక‌మైన మూవీగా నిలిచి పోవ‌డం ఖాయం అన్నారు. అంతే కాకుండా ప‌వ‌ర్ స్టార్ భావోద్వేగాలను చెక్కు చెదరకుండా ప్ర‌ద‌ర్శించ‌డంలో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చాడంటూ పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రారంభం నుండి చివరి వరకు దర్శకుడు ఈ చిత్రాన్ని అసాధారణ రీతిలో రూపొందించ‌డం బాగుంద‌న్నాడు. కళ్యాణ్ బాబును తెరపై చూడటం చాలా గర్వంగా అనిపించింద‌న్నారు. తన గొప్పతనంతో సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాడని పేర్కొన్నారు చిరంజీవి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అస‌లైన మ‌జాను అందించాడ‌ని, ద‌స‌రా, దీపావ‌ళి అనుభూతిని మ‌రింత క‌లిగించేలా చేశాడ‌న్నారు.

Also Read : TTD Gaja Vahanam Seva Interesting : అంగ‌రంగ వైభోగం క‌ళా వైభ‌వం

Exit mobile version