Chinta Mohan : విశాఖపట్నం జిల్లా : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chinta Mohan) సీరియస్ కామెంట్స్ చేశారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు దక్కుతుందన్నారు. బుధవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు కొరకు, ఆంధ్రుల ఆత్మగౌరవం కొరకు, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు శక్తేమిటో మాకు తెలుసన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి బతికున్నప్పుడు మేమిద్దరం మాట్లాడుకున్నామని అన్నారు చింతా మోహన్. ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుమ్మం ముందు తాకట్టు పెట్టారంటూ వాపోయారు. డిసెంబర్ 31 లోపు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయబోమని, కేంద్ర క్యాబినెట్లో పాస్ చేయాలన్నారు. చేయకపోతే, జరగకపోతే టిడిపి మద్దతు ఉపసంహరించు కోవాలని స్పష్టం చేశారు.
Ex Union Minister Chinta Mohan Slams CM Chandrababu
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక సామాన్య కుటుంబంలో పుట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకొని, తన కొడుకు జగన్మోహన్ రెడ్డిని బిలీనియర్ చేశాడని ఆరోపించారు. కానీ తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ నా కుమారుడిని ఏమీ చేయలేక పోయానంటూ వాపోయారు . ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డిని అభినందించక తప్పదన్నారు. చెన్నారెడ్డి కొడుకు సాధించ లేనిది, విజయ భాస్కర్ రెడ్డి కొడుకు సాధించ లేనిది, వెంగల్ రావు కొడుకు సాధించలేనిది, జనార్దన్ రెడ్డి కొడుకు సాధించలేనిది, వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ సాధించాడని, తాను మగాడినని నిరూపించు కున్నాడని ప్రశంసించారు.
Also Read : BJP Chief Ramachander Rao Shocking Comments : హైకోర్టు తీర్పు సర్కార్ కు చెంప పెట్టు

















