Chinta Mohan : తిరుపతి – ఈ దేశంలో గర్వించ దగిన మహోన్నత నాయకుడు, ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని ప్రశంసించారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chinta Mohan). బుధవారం రాజీవ్ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ గొప్ప నాయకుడు అని, దేశం కొరకు ప్రాణాలు అర్పించారని అన్నారు. అందరికీ విద్య అందించాలని కలలు కన్నారని, ప్రత్యేకించి ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియాకు రావడంలో కీలకమైన పాత్ర పోషించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 వేల ప్రాథమిక పాఠశాలలను మారుమూల పల్లెల్లో ప్రారంభించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. మరో వైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాథమిక పాఠశాలను మూసేస్తోందని ఆరోపించారు చింతా మోహన్.
Chinta Mohan Key Comments
తీసుకున్న చర్యలు దుర్మార్గం. అన్యాయం. అక్రమం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన అంత గొప్పగా లేదన్నారు. ఆయన పూర్తిగా నియంతలా పరిపాలిస్తున్నాడని మండిపడ్డారు. ఎస్సీలు కుప్పం నుంచ ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తుంటే కావాలని నిలిపి వేయించాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చెయ్యొచ్చు కానీ ఎస్సీలు పాదయాత్ర చేయకూడదా అని ప్రశ్నించారు. పాదయాత్రకు పర్మిషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు చింతా మోహన్. మోడీ ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 15 నయా పైసలు కూడా ఇవ్వలేక పోయారంటూ మండిపడ్డారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా కనిపించడం లేదన్నారు.
Also Read : Womens World Cup Interesting Update : మహిళల వరల్డ్ కప్ జట్టు ఎంపిక

















