చెన్నై : ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద నిప్పులు చెరిగారు. తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు శివాజీ మహిళలు, వస్త్రధారణ పట్ల చులకన చేస్తూ కామెంట్స్ చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించింది సింగర్. శివాజీపై చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతన్ని ‘ఇన్సెల్స్కు హీరో’ అని సంబోధించింది .శివాజీ చెప్పినట్లే నడుచుకుని, సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈవెంట్ల కోసం ఆధునిక దుస్తులు ధరించే మహిళా నటీమణులపై అనుచితమైన భాషను ఉపయోగించినందుకు గాయని చిన్మయి శ్రీపాద నటుడు శివాజీపై తీవ్రంగా మండిపడ్డారు.
‘దరిద్రపు ముండ’ వంటి దూషణ పదాలను ఉపయోగించి నటీమణులకు అనవసరమైన సలహాలు ఇచ్చారని పేర్కొంటూ, మహిళల శరీర భాగాలను తను సామాన్లు అంటూ పేర్కొన్నాడు. ఇలాంటి చవకబారు వంటి పదాలను ఉపయోగించినందుకు ఆమె ప్రత్యేకంగా అతన్ని నిందించారు. అతను ఒక అద్భుతమైన సినిమాలో విలన్గా నటించాడు. చివరకు తను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలుసుకోకుండా దిగజారాడని ఫైర్ అయ్యారు శ్రీపాద. అతను స్వయంగా జీన్స్, హూడీ ధరిస్తాడు. అతను కేవలం ధోవతులు మాత్రమే ధరించి భారతీయ సంస్కృతిని పాటించాలి. బొట్టు పెట్టుకోవాలి పెళ్లయినట్లయితే, తాను వివాహితుడని సూచించడానికి కంకణం, మెట్టెలు ధరించాలి. ఇక్కడ మహిళలను చూసే విధానం నమ్మశక్యం కానిదంటూ పేర్కొన్నారు.



















