మ‌ల్ల‌న్నను ద‌ర్శించు కోవ‌డం పూర్వ జ‌న్మ సుకృతం

భార‌త ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి జ్ఞానేష్ కుమార్

hellotelugu-EectionCommissioner

నంద్యాల జిల్లా : భార‌త దేశ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి జ్ఞానేష్ కుమార్ శ్రీశైలంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు ఆల‌య క‌మిటీ చైర్మ‌న్, సభ్యులు. త‌ను రాక సంద‌ర్భంగా జిల్లా ఎస్పీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ త‌న కుటుంబంతో క‌లిసి శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దర్శనార్థం శ్రీశైలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహం వద్దకు రాగానే జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ పూల మొక్కతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భారత ఎన్నికల ప్రధాన కమిషనర్  జ్ఞానేష్ కుమార్ మాట్లాడారు శ్రీ‌శైలం పుణ్య‌క్షేత్రంలో. శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దర్శనం చేసుకోవడం తనకు, తన కుటుంబానికి లభించిన గొప్ప అదృష్టమని అన్నారు.. పరమ శివుడిని, సాక్షాత్తు అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు . శ్రీశైల దేవస్థానంలో శివశక్తుల దర్శనం తనకు, తన కుటుంబానికి మరపురాని అనుభూతిగా నిలుస్తుందని పేర్కొన్నారు. స్వామి, అమ్మ వార్ల‌కు పూజ‌లు చేసిన అనంత‌రం ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో పూజారులు ఆశీర్వ‌చనాలు అంద‌జేశారు. స్వామి, అమ్మ వార్ల చిత్ర ప‌టాన్ని , ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

Exit mobile version