చెన్నై : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం అంబేద్కర్ స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన తీవ్రంగా స్పందించారు. తన రాజకీయ ప్రత్యర్థులపై సూక్ష్మంగా విమర్శించారు, ఒకప్పుడు అంబేద్కర్‌ను అణచి వేయడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు ఆయనను ప్రశంసిస్తున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 6వ తేదీ డాక్టర్ బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ వర్ధంతి . ఆయన వల్లనే దేశంలో అణగారిన వర్గాలకు గుర్తింపు దక్కిందన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్రంపై భగ్గుమన్నాయి.
ఇదిలా ఉండగా అంబేద్కర్ సంస్మరణ దినోత్సవం రోజు ప్రతి ఒక్కరికీ గుర్తింపు, గౌరవాన్ని కల్పించిన రోజుగా పేర్కొన్నారు ఎంకే స్టాలిన్. అంబేద్కర్ అణచివేతలను సవాలు చేసిన విప్లవకారుడు. అన్ని విధాలుగా అణచి వేసిన వ్యవస్థలోంచి, విద్య అనే ఆయుధంతో అన్నింటినీ బద్దలు కొట్టి, పైకి ఎదిగిన వ్యక్తి . అప్పట్లో ఆయనను అణచి వేయడానికి ప్రయత్నించిన అదే ఆధిపత్య సమూహం ఇప్పుడు ఆయనను ప్రశంసిస్తున్నట్లు నటిస్తోందని ఆరోపించారు. కాగా ఇదే ఆయన నిజమైన విజయం అని పేర్కొన్నారు .లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత 70వ వర్ధంతిని పునరుద్ఘాటించారు. అంబేద్కర్ ఆలోచనలను, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ఉమ్మడి జాతీయ బాధ్యత అని గాంధీ పునరుద్ఘాటించారు. అంబేద్కర్‌ను ఒక మహోన్నత జాతీయ వ్యక్తిగా అభివర్ణించారు,

















