మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బట్టలు మార్చినంత ఈజీ కాదు పార్టీలు మారడం అని అన్నారు . శామీర్ పేట్ క్యాంప్ కార్యాలయం (నివాసం)లో మీడియాతో మాట్లాడారు. తనను కేసీఆర్ బిఆర్ఎస్ నుండి పంపించి 5 ఏళ్లు అవుతుందన్నారు. అనంతరం బీజేపీలో చేరాను. ఎంపీగా గెలిచారు. అయితే ఇప్పుడు తనను లక్ష్యంగా చేసుకొని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు ఎంపీ. తాము పార్టీ మారుతున్నామని కొంతమంది పోస్టర్ లు వేస్తున్నారని, పార్టీ లు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదన్నారు. . పార్టీ లు మారకూడదు అని నేనే సందేశం ఇచ్చానన్నారు. నా గురుంచి తెలంగాణ సమాజానికి పూర్తిగా తెలుసన్నారు. అందుకే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
తాను 25 ఏళ్లు ఉన్నా కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్న వారు, అభిమానించే వారు బిఆర్ఎస్ లో ఉన్నారని అన్నారు ఈటల రాజేందర్. ఈటలను పోగొట్టుకొని కేసీఆర్ తప్పు చేశారని ప్రజలు అంటున్నారని, పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోందన్నారు. మళ్ళీ వీళ్లందరూ కెసిఆర్ తో కలుస్తారంటూ చర్చ జరుగుతోందని, ఇలాంటి నిరాధారమైన ప్రచారం చేయొద్దని హితవు పలికారు.
నన్ను బర్తరఫ్ చేయడమే కాకుండా నన్ను తన శక్తినంతా ఉపయోగించి ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు ఎంపీ. కేసీఆర్ చేయని పనంటూ లేదన్నారు. నా కోళ్ళ ఫార్మ్ లు కూల్చారు. భూములు గుంజుకున్నారు. నేను లీగల్ గా కొనుక్కున్నవి చెరబట్టారని ఆరోపించారు.



















