గాంధీ పేరు మార్చ‌డం దేశ ద్రోహం : ష‌ర్మిలా రెడ్డి

కేంద్ర స‌ర్కార్ నిర్వాకంపై సీరియ‌స్ కామెంట్స్

hellotelugu-YSSharmilaReddy

విజ‌య‌వాడ : కేంద్ర స‌ర్కార్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ అభినవ గాడ్సే అని తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు. త‌ను నాతురామ్ గాడ్సేకు వారసుడ‌ని, ఇవాల్టితో త‌న అస‌లు రూపం ఏమిటో బ‌య‌ట ప‌డింద‌న్నారు. అనాడు గాడ్సే మహాత్మను భౌతికంగా హత్య చేస్తే, ఇవాళ‌ బాపుజీ పేరు తొలగించి గాంధీజీ ఆశయాలను, స్వాతంత్రపు లక్ష్యాలను, నేర్పిన సిద్ధాంతాలను తుడిచిపెట్టి మోడీ మరో హత్య చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఉపాధి హామీ పథకానికి జాతిపిత పేరు మార్చాలని చూడటం దేశ ద్రోహపు చర్యగా ఆమె పేర్కొన్నారు.

ఇది మహాత్మా గాంధీకి ఎన్డీయే ప్ర‌భుత్వం చేస్తున్న తీర‌ని అన్యాయ‌మ‌ని వాపోయారు. పథకానికి “రామ్ – జి” (రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్) పేరు పెట్టీ గాంధీజీని అవమానించాలని చూసే కుట్ర త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. నరేగా పథకాన్ని ఆర్ఎస్ఎస్ స్కీమ్ గా మార్పు చేస్తున్నారని ధ్వ‌జమెత్తారు. మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థకం (ఎంజీఎన్ఆర్జీఏ) కు ఉన్న ప‌ళంగా పేరు మార్చాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించారు ప్ర‌ధాని మోదీని, కేంద్ర స‌ర్కార్ ను ష‌ర్మిలా రెడ్డి. 100 రోజుల పని దినాల నుంచి 125 రోజుల పెంచేందుకు గాంధీజీ పేరు మారుస్తారా అని నిల‌దీశారు. మహాత్మా పేరు చెరిపేస్తే ఖర్చు తప్పా.. మోడీకి దక్కే లాభం ఏంటి అని మండిప‌డ్డారు. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుల మీద‌, ఈ దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రుల మీద బీజేపికి ఎందుకంత కోపం అని ఫైర్ అయ్యారు.

Exit mobile version