Chandu Janardhan : విజయవాడ : దొమ్మరులను గిరి బలిజలుగా మార్చిప్రభుత్వం ఇచ్చిన జీఓ నెంబర్ 5 పై స్టేటస్ కో ఇచ్చి జీఓ7 ను ఇవ్వడాన్ని రాష్ట్ర కాపు జెఏసి అధ్యక్షులు చందు జనార్దన్ (Chandu Janardhan) స్వాగతించారు. ఈ సందర్బంగా సర్కార్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశం లో చందు జనార్దన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పెద్దలు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రులు లోకేష్, ఎస్ సవిత , ఎంపీ సానా సతీష్ లకు థ్యాంక్స్ తెలిపారు. గిరి బలిజ పేరు తో బలిజ, కాపు వర్గాలను అవమానించారని, కులం చాలా అవమానానికి గురయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు వర్గాల సమస్య లు అనేకం ఉండగా కొత్త సమస్య లను తెస్తున్నారని మండిపడ్డారు. పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
Chandu Janardhan Demands
బీసీ రిజర్వేషన్ కు పరిస్కారం చూపాలని, కాపు కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయాలని, కాపు భవనాల నిర్మాణం పూర్తి చేయాలని , కృష్ణ జిల్లాకు స్వర్గీయ వంగవీటి మెహన రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని చందు జనార్దన్. జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో, రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత నివ్వాలని కోరారు. ఉద్యోగులుగా ఉన్న కాపులకు ప్రాధాన్యత గల స్థానంలో పోస్టింగ్ ఇవ్వాలని సూచించారు. బీసీ రిజర్వేషన్, అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం కాపు జేఏసీ నిరంతరాయంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
Also Read : National SC Commission Strong Reaction : ఎంపీ ఆవేదన జాతీయ ఎస్సీ కమిషన్ స్పందన


















