చంద్ర‌బాబు విజ‌న్ ఏపీకి వ‌రం లాంటిది : ఎంపీ

గ‌త జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌లో రాష్ట్రం వందేళ్లు వెన‌క్కి

hellotelugu-MPAppalaNaidu

మంగ‌ళ‌గిరి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌శంస‌లు కురిపించారు ఎంపీ అప్ప‌ల నాయుడు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌తంలో పాలించిన జ‌గ‌న్ రెడ్డి నిర్వాకం కార‌ణంగా ఏపీ వందేళ్లు వెన‌క్కి వెళ్లింద‌న్నారు. ఆనాడు మనోభావాలను దెబ్బతీసేలా పాలన సాగిందని ఆరోపించారు. కానీ నేడు చంద్రబాబు పాలనా అనుభవం, విజన్ వల్ల రెండేళ్లు కాకముందే ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు లోకేష్ బాబు, బీజేపీ నాయకత్వం.. రాష్ట్రానికి నాలుగు స్తంభాలుగా నిలబ‌డ్డార‌ని, ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు ఎంపీ.

రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తున్నారని, అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదని.. చేతల్లో చూపిస్తున్నామని స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చి అభివృద్ధికి పట్టం కట్టారని, అయితే ఓటమి తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి తన దుర్మార్గపు ఆలోచనలను మానుకోలేదని విమర్శించారు. కన్నతల్లిని, తోబుట్టువును కూడా గౌరవించలేని వ్యక్తికి సమాజంలో ఉండే అర్హత లేదని ధ్వజమెత్తారు. లోకంలో ఏ బిడ్డ అయినా అమ్మను దైవంగా భావిస్తాడు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన స్వార్థం కోసం కన్నతల్లి విజయమ్మనే కోర్టులకు ఈడ్చి, ఆమెను మానసిక వేదనకు గురిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు. పేటీఎం బ్యాచ్‌తో ఆమెపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. సొంత తల్లి పట్ల, చెల్లి పట్ల కనీస సానుభూతి, గౌరవం లేని ఈ వ్యక్తిని ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా భరించడం మన దౌర్భాగ్యం అన్నారు.

Exit mobile version