విజయవాడ : ఏపీ కూటమి సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి,,సంక్షేమం, ఇచ్చిన హామీలపై శ్రద్ధ లేదన్నారు. విచిత్రం ఏమిటంటే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడ లేదంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ నివేదికలో స్పష్టం చేసిందని అన్నారు. కానీ తాము గతంలో చేసిన దుష్ప్రచారాన్ని కప్పి పుచ్చుకునేందుకే చవకబారు విమర్శలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని ఆరోపించారు. మంగళవారం విజయవాడలో దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. వాస్తవాలు బయటకు తెలుస్తున్నాయని డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారంటూ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై నిందలు మోపారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చిందన్నారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటానికి దుర్గ గుడి మెట్లు కడిగి పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారంటూ ఎద్దేవా చేశారు. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని, బేషరతుగా అబద్దం ఆడిన చంద్రబాబు, ఆయన పరివారం, డిప్యూటీ సీఎం బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు దేవినేని అవినాష్.
