మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు

ఏపీ ఉద్యోగుల ఖాతాల్లో రూ.1,100 కోట్లు జమ‌

hellotelugu-APCM

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కొత్త ఏడాదిలో ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన మాట ప్ర‌కారం అంద‌రికీ త‌మ త‌మ ఖాతాల్లో డీఏలు రూ. 1,100 కోట్లు జ‌మ చేశారు. దీంతో ఫుల్ ఎంజాయ్ చేశారు సంక్రాంతి ఫెస్టివ‌ల్ ను. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల ఖాతాల్లో నేరుగా జ‌మ చేసింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉంచి డీఏ బకాయిలను ఒకేసారి విడుదల చేసి ఉద్యోగుల ఇళ్లల్లో అసలైన పండుగ వాతావరణం నింపింది. ఉద్యోగుల ఖాతాల్లో దాదాపు 1100 కోట్ల రూపాయలకు పైగా జమ అయ్యాయి. 2019 నుంచి దాదాపు 60 నెలల పాటు పెండింగ్‌లో ఉన్న డీఏ (క‌రువు భ‌త్యం) బకాయిలను కూటమి ప్రభుత్వం క్లియర్ చేసింది.

దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.25 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, మరో 2 లక్షల 70 వేల మంది పెన్షనర్లకు నేరుగా నగదు రూపంలో లబ్ధి చేకూరింది. ఒక్కో ఉద్యోగి ఖాతాలోకి వారి మూల వేతనాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు జమ అయ్యాయి. పండుగ పూట డబ్బులు రావడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా ఇచ్చిన మాటను నెర‌వేర్చినందుకు ఉద్యోగ సంఘాల నేత‌లు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించేందుకు కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Exit mobile version