బీసీల వెన్నెముక విరుస్తున్న చంద్రబాబు

డిమాండ్లు నెరవేర్చే దాకా బిసి ధర్మదీక్ష ఆగ‌దు

hellotelugu-RamachandraYadav

అమ‌రావ‌తి : బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ నిప్పులు చెరిగారు సీఎం చంద్రబాబు నాయుడుపై. తాను చేపట్టిన బీసీ ధర్మ దీక్ష మూడో రోజుకు చేరుకుంది.ఆహారం తీసుకోక పోవడంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన శరీరంలో ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని, ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ కూడా పడిపోవచ్చని వైద్య బృందం హెచ్చరించింది. అయినప్పటికీ, ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు, న్యాయ పరమైన డిమాండ్లు నెరవేర్చే వరకు తన దీక్షను విరమించే ప్రసక్తే లేదని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.

రామచంద్ర యాదవ్ ధర్మ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. తెలగ, కాపు, బలిజ జెఎసి ఛైర్మన్ దాసరి రాము, అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య, కార్యదర్శి పిఎల్పి యాదవ్, జాతీయ యాదవ సంఘం సెక్రటరీ జనరల్ బొడ్డు రమేష్ యాదవ్, జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు, బిసి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వూరు అరుణ, గుంటూరు జిల్లా ఏబీవీపీ నాయకులు వంశీకృష్ణ, బీసీ నాయీ బ్రాహ్మణ వాద్య కళాకారుల సంఘం నుంచి యల మందరావు, ఢిల్లీలోని ఆల్ ఇండియా వడ్డెర కౌన్సిల్ నాయకులు చల్లా లీలా భానుప్రసాద్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సి. కృష్ణ సహా అనేకమంది ప్రముఖులు, సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. మాజీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు.

Exit mobile version