తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శ్రీవారి దర్శనం కోసం సంబంధించి తీపి కబురు చెప్పింది భక్తులకు. ప్రత్యేకించి వృద్ధుల కోసం ఉచిత తిరుపతి బాలాజీ దర్శన పథకం ప్రారంభించింది. ఈ స్పెషల్ స్కీంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు .ఇందులో భాగంగా తిరుపతిలో వృద్ధుల కోసం ఉచితంగా బాలాజీ దర్శన పథకం ప్రారంభమైంది. ఈ స్కీంలో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో దర్శనం కల్పించేందుకు వృద్దులు ఎవరైనా 65 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులు ఈ పథకానికి అర్హులు.
ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులకు ఉచితంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఎస్ 1 కౌంటర్ వద్ద ఫొటో గుర్తింపు కార్డుు, వయస్సు ధృవీకరణ పత్రం చూపితే దర్శనానికి అనుమతిస్తారని స్పష్టం చేశారు
వంతెన కింద ఉన్న గ్యాలరీ ద్వారా దేవాలయం కుడిగోడ వెంబడి ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. దర్శనానికి వెళ్లే మార్గం కనిపిస్తుందని, క్యూ లైన్లోకి వెళ్లాక 30 నిమిషాల్లో దర్శనం పూర్తవుతుందని తెలిపారు. దర్శనానంతరం భక్తులకు ఉచిత భోజనంతో పాటు వేడి పాలు అందిస్తామన్నారు. సహాయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం హెల్ప్ డెస్క్ నంబర్ 87722 77777 ను సంప్రదించాలని సూచించారు ఈవో.
