దీన బాంధ‌వుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్

ఘ‌నంగా నివాళులు అర్పించిన టీవీకే పార్టీ చీఫ్

hellotelugu-TVKVijay

చెన్నై : దీన జ‌న బాంధ‌వుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అని కొనియాడారు టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్. మంగ‌ళవారం అంబేద్క‌ర్ 135వ జ‌యంతి సంద‌ర్బంగా ఆయ‌న చిత్ర ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు కీల‌క సందేశం వినిపించారు. ఇవాళ నీతికి, నిజాయితీకి, ధ‌ర్మానికి అధ‌ర్మానికి మ‌ధ్య కీల‌క పోరాటం జ‌రుగుతోంద‌ని చెప్పారు. పొలిటిక‌ల్ ప‌వ‌ర్ ఈస్ ది మాస్ట‌ర్ కీ అన్న డాక్ట‌ర్ అంబేద్క‌ర్ ను ఆద‌ర్శంగా తీసుకుని తాను రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాన‌ని చెప్పారు. ఈనెల 23న రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లు రాష్ట్ర భ‌విత‌వ్యాన్ని నిర్దేశించ‌నున్నాయ‌ని అన్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్. భార‌త రాజ్యాంగం అన్న‌ది లేక పోతే మ‌నం లేమ‌న్నారు. ఇందు కోసం ఎంత‌గానో కృషి చేసిన మ‌హ‌నీయుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు టీవీకే పార్టీ చీఫ్‌. తమిళనాడు వెట్రి పార్టీ’ (TVK) సిద్ధాంతాలకు ప్రధాన నాయకుడిగా అభివర్ణించారు.
కేవలం చట్టపరమైన హక్కులే కాకుండా, సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం కూడా ప్రతి ఒక్కరికీ దక్కాలని నొక్కి చెబుతూ, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేద్కర్ కి మ‌న‌మంతా రుణ‌ప‌డి ఉన్నామ‌ని అన్నారు విజ‌య్. మన సమాజంలోని అసమానతలను రూపుమాపి, అందరికీ సమానత్వం శాశ్వతంగా లభించేలా చూస్తామని మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం అని పిలుపునిచ‌చ్చారు.

Exit mobile version