CM Siddaramaiah : కర్ణాటక : కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య (CM Siddaramaiah). శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలని కన్నడ భాషను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇలా చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. కావాలని హిందీ భాషను తమపై రుద్దాలని చూస్తోందని సంచలన ఆరోపణలు చేశారు సీఎం. కన్నడ భాషను వ్యతిరేకించే వారిని భరించాల్సిన అవసరం లేదన్నారు. వారిపై ఝలక్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. కేంద్రం కన్నడను నిర్లక్ష్యం చేసి హిందీని రుద్దుతోందంటూ సిద్దరామయ్య మండిపడ్డారు. ఫెడరల్ ప్రభుత్వం కర్ణాటక పట్ల సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
CM Siddaramaiah Slams Union Govt
రాష్ట్ర రాజధాని బెంగళూరులో జరిగిన రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిద్ధరామయ్య ప్రసంగించారు. రాష్ట్రం కేంద్రానికి రూ.4.5 లక్షల కోట్ల ఆదాయాన్ని అందిస్తుందని, కానీ దానికి రావాల్సిన హక్కును నిరాకరించి, దానికి బదులుగా కొద్ది మొత్తాన్ని ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కన్నడ భాషకు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి వాపోయారు. హిందీని బలవంతంగా రుద్దడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. హిందీ , సంస్కృతం అభివృద్ధికి గ్రాంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ఇతర భాషలు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. శాస్త్రీయ భాష కన్నడ వృద్ధికి తగిన నిధులు నిరాకరించడం ద్వారా అన్యాయం జరుగుతోందన్నారు.
Also Read : Minister Ponnam Fired on PM Modi : మోదీ కామెంట్స్ పొన్నం ప్రభాకర్ సీరియస్
















