GST : భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై ప్రసంగిస్తూ జీఎస్టీ శ్లాబ్‌లలో సంస్కరణలు త్వరలోనే అమలులోకి రానున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ధరలను తగ్గించేందుకు, సామాన్యుడిపై పన్ను భారం తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం జీఎస్టీ (GST) కౌన్సిల్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో, రాష్ట్ర ఆర్థిక మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. నాలుగు శ్లాబ్‌ల వ్యవస్థను తగ్గించి, కేవలం 5% మరియు 18% అనే రెండు ప్రధాన శ్లాబ్‌లలో జీఎస్టీ (GST) విధించాలన్న ప్రతిపాదనపై చర్చలు సాగుతున్నాయి.
GST – తాజా ప్రతిపాదనల ప్రకారం – మారిన శ్లాబ్‌లు
12% మరియు 28% శ్లాబ్‌లు తొలగింపు:
ప్రస్తుత 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను రద్దు చేసి, వాటిలోని వస్తువులను మిగిలిన 5% మరియు 18% శ్లాబ్‌లలోకి తరలించనున్నారు.
పేద, మధ్యతరగతి మరియు MSMEలకు ఊరట:
వ్యవసాయ రంగం, చిన్న పరిశ్రమలు, పౌష్టికాహార ఉత్పత్తులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు ఈ మార్పులు చేపడుతున్నారు.
హానికరమైన వస్తువులపై 40% ప్రత్యేక రేటు:
పాన్‌మసాలా, పొగాకు, ఆన్‌లైన్ గేమింగ్ వంటివి 40 శాతం ప్రత్యేక శ్లాబ్‌కు చెందనున్నాయి.
ముఖ్యమైన వస్తువులపై జీఎస్టీ మార్పులు
శూన్య శాతం జీఎస్టీ:
బియ్యం, గోధుమలు, పప్పులు, తాజా కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, శానిటరీ నాప్కిన్లు.
5 శాతం జీఎస్టీ:
బ్రాండెడ్ బియ్యం, నెయ్యి, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, అన్ని ధరల దుస్తులు, పత్తి మరియు పట్టు బట్టలు.
18 శాతం జీఎస్టీ:
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు (గతం లో 28% ఉండేది).
వివిధ రంగాలపై ప్రభావం:
ఆరోగ్య సేవలు, విద్యా సేవలు – పన్ను లేకుండా లేదా కనిష్ఠ రేటుతో కొనసాగించనున్నారు. ముఖ్య ఔషధాలపై జీఎస్టీ 12% నుండి 5%కి లేదా సున్నాకు మారే అవకాశం.
ప్రజా రవాణా సేవలు:
నాన్-ఏసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలపై 5% లేదా నిలిచిన జీఎస్టీ.
వ్యక్తిగత సంరక్షణ వస్తువులకు ఊరట
టూత్‌పేస్ట్, సబ్బులు, షాంపూలు వంటివి 5% శ్లాబ్‌కు చేరనుండగా, ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులపై కూడా అదే రేటు వర్తించనుంది.
మార్పుల అమలు – దీపావళి 2025 నాటికి
ఈ మార్పులను దీపావళి 2025 నాటికి అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కేంద్రం నియమించిన మంత్రుల బృందం (GoM) ద్వారా మార్పులకు తుది రూపు ఇవ్వనున్నారు.
బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కన్వీనర్‌గా ఉన్న ఈ బృందంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మంత్రులు సభ్యులుగా ఉన్నారు. మెరిట్ మరియు స్టాండర్డ్ కేటగిరీల్లోని వస్తువులను 5% లేదా 18% శ్లాబ్‌లలో వర్గీకరించి, సరళమైన పన్ను వ్యవస్థకు దోహదపడే విధంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read : Stock Market Sensational : 5వ రోజు మార్కెట్ ముందుకు 25000 పాయింట్లతో నిఫ్టీ



















