EC : ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 25 పార్టీలను రద్దు చేసినట్లు తెలిపింది. మరో వైపు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన లోక్‌సత్తా పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) వేటు వేసింది. తెలంగాణలో ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా క్రియాశీలకంగా లేని, నిబంధనలు పాటించని గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై ఈ చర్య తీసుకుంది.
EC Shocking Updates
కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా దేశ వ్యాప్తంగా పలు పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. వీటిలో ఏపీకి చెందిన 17 పార్టీలు, తెలంగాణకు చెందిన 8 పార్టీలు ఉన్నాయి. గత ఆరేళ్లుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయక పోవడం, పార్టీ కార్యాలయ చిరునామా, ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించక పోవడం వంటి కారణాలతో ఈసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రద్దయిన పార్టీల జాబితాలో లోక్‌సత్తాతో పాటు ఆలిండియా ఆజాద్ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, నవ భారత్ నేషనల్ పార్టీ వంటివి ఉన్నాయి.
రాజకీయాల్లో సంస్కరణలు తీసుకు రావాలనే లక్ష్యంతో జేపీ 2006లో లోక్‌సత్తా పార్టీని స్థాపించారు. 2009లో కూకట్‌పల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న జేపీ, ప్రస్తుతం కేవలం చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ గుర్తింపు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : Minister Savitha Interesting Update : 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం : సవిత
















