న్యూఢిల్లీ : కేంద్రంలో కొలువు మీరిన బీజేపీ ఎన్డీయే సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. యుద్దం నెలకొన్న ప్రస్తుత తరుణంలో తీవ్ర సంక్షోభం నెలకొంది గ్యాస్, పెట్రోల్, ఆయిల్ కు సంబంధించి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో ముందస్తు సంక్షోభం రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పీఎం. మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు లేక పోలేదని లోక్ సభ సాక్షిగా ప్రకటించారు . దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ప్రజలు , వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు. ఈ తరుణంలో కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులపై ఎల్పీజీ ఫీజులు లేదా ఇంధన వ్యయ వసూలు వంటి అదనపు ఛార్జీలను విధించవద్దని ఆదేశించింది. మెనూ ధరలకు వర్తించే పన్నులను మాత్రమే జోడించ వచ్చని, మిగతా అన్ని ఖర్చులు ఇప్పటికే చేర్చి ఉండాలని అది స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అథారిటీ హెచ్చరించింది. ఇటువంటి ఛార్జీలను ఎదుర్కొంటున్న వినియోగదారులు, వాటిని బిల్లు నుండి తొలగించమని అభ్యర్థించాలని లేదా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (1915), ఎన్‌సీహెచ్ యాప్, ఇ-జాగృతి పోర్టల్ లేదా స్థానిక అధికారుల ద్వారా ఫిర్యాదులు చేయాలని సూచించింది.
