తిరుపతి : రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన సీబీఎన్ అని అన్నారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. శుక్రవారం తిరుపతిలో జరిగిన సభలో ప్రసంగించారు. అవతల వైపు బౌలర్లు మారతారు తప్ప ఇటు వైపు ఒకే ఒక్క బ్యాట్స్‌మన్ సీబీఎన్. అటువైపు బౌలర్ ఎవరైనా ఇటు సూపర్ సిక్స్ కొట్టేది మాత్రం మన సీబీఎన్. రాయలసీమను రాయల్ సీమగా మార్చేసింది మన సీబీఎన్. అప్పుడు కియా…ఇప్పుడు రాయల్ ఎన్ ఫీల్డ్. డ్రిప్ ఇరిగేషన్ తో సీమలో బంగారం పండేలా చేసింది సీబీఎన్. హంద్రీ – నీవా సుజల స్రవంతి ద్వారా కుప్పానికి నీళ్లు ఇచ్చింది కూడా సీబీఎన్. పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చింది సీబీఎన్. ఇప్పుడు లక్షకోట్లతో మిషన్ రాయలసీమ స్టార్ట్ చేస్తుంది చంద్రబబు నాయుడేనని మరిచి పోవద్దన్నారు నారా లోకేష్.
2019 నుండి 2024 వరకు గొడ్డలి పార్టీ అరాచక పరిపాలన మనం చూశాం. బీసీ బిడ్డ అమర్‌నాథ్ గౌడ్ పై పెట్రోలు పోసి చంపేశారు. దళిత వైద్యుడు సుధాకర్ ని పిచ్చోడని ముద్ర వేసి చంపేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసి డోర్ డెలివరీ చేశారు. అబ్దుల్ సలామ్ కుటుంబంతో సామూహికంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. కుటుంబాన్ని విడిచి మిస్బా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. టీడీపీ జెండా లేకుండా చేస్తాం అన్నారు, ప్రజలే వాళ్ల జెండా పీకేశారు. వై నాట్ 175 అన్నారు. ప్రజాలు టీమ్ 11 ఇచ్చారు. వాళ్లు సిద్ధం అంటే…ప్రజలు యుద్ధం అన్నారు. మమ్మల్ని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వం అన్నారు, ప్రజలే వాళ్లని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశారు. ఇప్పుడు రప్పా రప్పా అంటున్నారు – ప్రజలే రఫ్పాడిస్తారు.
















