జాన్వీ కపూర్ ‘ఏఐ వీడియో’పై కేసు నమోదు

సీఎం , న‌టి మౌళి మారేడుల మార్ఫింగ్ పై కూడా

hellotelugu-JanhviKapoor

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టి జాన్వీ క‌పూర్, జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన చిత్రం దేవ‌ర‌. ఇందులో కీల‌క‌మైన పాట‌ను ఇటీవ‌లే సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏఐతో డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఇంతగా దిగ‌జారితే ఎలా అని మండిప‌డ్డారు. దీంతో జాన్వీ కపూర్ ఏఐ వీడియోపై పోలీసుల కేసు నమోదు చేశారు. సీఎం, నటి వాణి మార్ఫ్డ్ చిత్రాలను పోస్ట్ చేసినందుకు కూడా కేసులు న‌మోదు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో నటి జాన్వీ కపూర్ కు చెందిన‌ మార్ఫ్డ్ (ఏఐ ద్వారా మార్చబడిన) వీడియోలను పోస్ట్ చేసిన దుండగులపై తెలంగాణ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అలాగే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి , నటి సురేఖ వాణిల అసభ్యకర చిత్రాలను పోస్ట్ చేసిన డిజి టీవీ పేర‌డీపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

మొదటి కేసు విషయానికొస్తే గత రెండు రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారమైన జాన్వీ కపూర్ AI-మార్పులు చేసిన వీడియోలకు సంబంధించి ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యాజమాన్యాలకు లేఖ రాయడం ద్వారా అటువంటి లింక్‌లను వెంటనే బ్లాక్ చేసి చర్యలు తీసుకుంటామ‌ని అని పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ , జాన్వీ కపూర్ నటించిన తెలుగు చిత్రం ‘దేవర’లోని వీడియోలను దుండగులు సేకరించారు. ఏఐ సాధనాలను ఉపయోగించి ఆమెను నగ్నంగా చూపించేలా ఆ వీడియోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దర్యాప్తులో భాగంగా ఆ వీడియోల అసలు పేజీలను గుర్తించి బ్లాక్ చేయడానికి కృషి చేస్తున్నారు.

ఆ తర్వాత పోస్ట్‌ల ఐపీ అడ్రస్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటామ‌న్నారు. ‘చుట్టమల్లెస ఏఐ వివాదం మధ్య జాన్వీ కపూర్‌కు ఖుష్బూ సుందర్ మద్దతిచ్చారు. ఇదే క్ర‌మంలో ఎన్టీఆర్ కు న‌టులు విజయ్ దేవ‌ర‌కొండ‌, మెగాస్టార్ చిరంజీవి సైతం స‌పోర్ట్ చేశారు.

Exit mobile version