Kurnool : కర్నూలు జిల్లా : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న బస్సు ఘటన. అక్టోబర్ 24వ తేదీ అర్ధరాత్రి 3 గంటల నుండి 3.30 గంటల మధ్య కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు దగ్ధమైంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలు దేరుతుండగా బైక్ ను తప్పించ బోయి షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి. ఈ బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 20 మంది సజీవ దహనం అయ్యారు. 21 మంది అదృష్ట వశాత్తు బతికి బయట పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ప్రధానంగా యంగ్ కలెక్టర్ గా ఉన్న కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి , కర్నూల్ (Kurnool) రేంజ్ ఐజీ కోయ ప్రవీణ్ లు రేయింబవళ్లు శ్రమించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. గాయపడిన వారు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Case Registered on Kurnool Bus Incident
ఇదిలా ఉండగా తాజాగా ఈ బస్సు ఘటనకు సంబంధించి కీలక అప్ డేట్స్ వచ్చాయి. ఈ మేరకు పోలీసులు కీలక ప్రకటన చేశారు. ప్రయాణికుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. ఏ1గా వి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ , ఏ2గా కావేరి ట్రావెల్స్ యజమానిని చేర్చింది. రమేష్ అనే ప్రయాణికుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. ఇదిలా ఉండగా డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు. డ్రైవర్‌తో పాటు యజమానిపై రెండు సెక్షన్ల కింద కేసు చేశారు. BNS 125(a), 106(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
Also Read : AP Heavy Rains Warning : ఏపీకి గండంగా మారిన వాయుగుండం
















