Auto Mobile : భారత ప్రభుత్వం ఆటోమొబైల్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకోవడానికి సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా చిన్న కార్లపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ (GST) రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనున్న అవకాశముంది. ఈ నిర్ణయం అమలైతే కార్ల కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రత్యక్షంగా ధర తగ్గే అవకాశం ఉంది.
ఉదాహరణకు, రూ. 6 లక్షల విలువైన కారును కొనుగోలు చేసే వినియోగదారుడు దాదాపు రూ. 66,000 వరకు ఆదా చేయవచ్చు. దీని ప్రభావంతో కేవలం కారు ధరనే కాక, EMI చెల్లింపులు కూడా తగ్గవచ్చు. కార్ లోన్‌పై వడ్డీ భారం కొంత మేర తగ్గే అవకాశం కూడా ఉంది.
Auto Mobile – ఆటో రంగానికి ఊపు
ఆటో పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీఎస్టీ (GST) తగ్గింపుతో చిన్న కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో సాధారణ ప్రజలకు కార్లు మరింత చేరువ అవుతాయి. డిమాండ్ పెరిగే పరిస్థితుల్లో కార్ల తయారీ సంస్థలకు కూడా ఇది లాభదాయకం అవుతుంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఆర్థిక ఉపశమనం కల్పించడమే కాక, ఆటో పరిశ్రమలో వృద్ధికి దోహదపడటం.
ప్రస్తుతం మరియు ప్రతిపాదిత ధరలు – ప్రముఖ కార్లు
1. మారుతి బాలెనో
- ఎక్స్-షోరూమ్ ధర: రూ. 8 లక్షలు
- ప్రస్తుత ధర (29% పన్నుతో): రూ. 10.32 లక్షలు
- కొత్త ధర (18% పన్నుతో): రూ. 9.44 లక్షలు
- ఆదా: రూ. 88,000
2. హ్యుందాయ్ ఐ20
- ఎక్స్-షోరూమ్ ధర: రూ. 10 లక్షలు
- ప్రస్తుత ధర: రూ. 12.90 లక్షలు
- కొత్త ధర: రూ. 11.80 లక్షలు
- ఆదా: రూ. 1.10 లక్షలు
3. హ్యుందాయ్ వెర్నా (మిడ్-సైజ్ సెడాన్)
- ఎక్స్-షోరూమ్ ధర: రూ. 12 లక్షలు
- ప్రస్తుత ధర: రూ. 17.16 లక్షలు
- కొత్త ధర (40% పన్నుతో): రూ. 16.80 లక్షలు
- ఆదా: రూ. 36,000
పెద్ద SUVలపై ప్రభావం
1500 సీసీ కంటే అధిక సామర్థ్యం కలిగిన, 4 మీటర్ల కంటే పొడవైన SUVలపై ప్రస్తుతం 50 శాతం పన్ను ఉంది. ప్రతిపాదిత మార్పుల ప్రకారం ఈ రేటును 40 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. కానీ ఈ తగ్గింపు ద్వారా కలిగే ప్రయోజనం చిన్న కార్లతో పోల్చితే తక్కువగానే ఉంటుంది.
4. మహీంద్రా XUV700
- ఎక్స్-షోరూమ్ ధర: రూ. 20 లక్షలు
- ప్రస్తుత ధర: రూ. 30 లక్షలు
- కొత్త ధర: రూ. 28 లక్షలు
- ఆదా: రూ. 2 లక్షలు
ఎలక్ట్రిక్ వాహనాలపై మార్పులుండవు
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై 5% జీఎస్టీ (GST) మాత్రమే అమలులో ఉంది. ప్రతిపాదిత మార్పుల్లో వీటి పన్ను నిర్మాణంలో ఎలాంటి మార్పు ఉండబోదని సమాచారం. దీంతో ఈ వాహనాల కొనుగోలుదారులకు అదనపు భారం పడదు కానీ అదనపు ప్రయోజనం కూడా లభించదు.
వినియోగదారులకు సలహా
6 నుంచి 12 లక్షల మధ్య ధర కలిగిన హ్యాచ్‌బ్యాక్‌లు లేదా కాంపాక్ట్ సెడాన్లు కొనుగోలు చేయాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండటం మంచిది. జీఎస్టీ తగ్గింపు వల్ల రూ. 70 వేల నుంచి రూ. 1.2 లక్షల వరకు ఆదా అవుతుంది. SUVలు, మిడ్-సైజ్ సెడాన్లు కొన్నవారికీ ఉపశమనం లభించినా, చిన్న కార్లపై ప్రభావం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
Also Read : Today Gold Price : తగ్గినట్లే తగ్గి ఒక్కసారే దంచికొడుతున్న పసిడి ధరలు
