Car : ముంబై : దీపావళి పండుగ జోష్ వాహనాల తయారీ కంపెనీలలో ఫుల్ జోష్ నింపేలా చేసింది. ఏకంగా దేశ వ్యాప్తంగా లక్ష యూనిట్ల కార్ల (Car) అమ్మకాలు దాటడం విశేషం. ఇందులో ప్రముఖ కంపెనీలు మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ , తదితర కంపెనీలు రికార్డు బ్రేక్ చేశాయి. కొత్త మోడళ్ల కోసం వాహనదారులు ఎగబడ్డారు. అన్ని షో రూంలు కళ కళ లాడాయి.రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి . డెలివరీలతో పండుగ సీజన్ కొనుగోళ్ల జోరును పెంచింది . కేవలం 24 గంటల్లోనే 1, 00,000 కార్లను దాటింది. పరిశ్రమ ప్రముఖుల ప్రకారం ఈ మైలురాయి టర్నోవర్‌లో బిగ్ రికార్డ్ గా పేర్కొన్నారు మార్కెట్ నిపుణులు. ఇదిలా ఉండగా దేశంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం ఇటీవల మోదీ సూచనల మేరకు జీఎస్టీ సంస్కరణలకు తెర తీశారు. ఇందులో భాగంగా 80 శాతానికి పైగా వస్తువులపై భారీగా డిస్కౌంట్స్ లభించాయి.
Huge Car Sales
ఇదే ఎఫెక్టు వస్తువులు, సేవల పన్ను 2.0 రేటు తగ్గింపు భారీ అమ్మకాలు పెరిగేలా చేశాయని అంనా వేస్తున్నారు. ఈ సంవత్సరం దీపావళి పండుగ సీజన్ మొదటి రోజున మారుతి సుజుకి 51,000 కార్లను డెలివరీ చేసింది, ఇదిలా ఉండగా గత సంవత్సరం కంటే దాదాపు 25 శాతం ఎక్కువ. 2024లో, ధన్‌తేరాస్ రోజున మారుతి 41,000 కార్లను విక్రయించింది. దీన్ని ట్టి చూస్తే 17 శాతం పెరిగింది . ఇక 2022లో టాటా మోటార్స్ నవరాత్రి నుండి దీపావళి వరకు టాటా మోటార్స్ 33 శాతం వృద్దితో లక్షకు పైగా కార్లు, మహీంద్రా ఎస్ యూ ఈ కంపెనీల వాహనాలు అమ్ముడు పోవడం విస్తు పోయేలా చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నారు టాటా మోటార్స్ ప్యాసింజర్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శైలేష్ చంద్ర. ప్రధానంగా తాము తయారు చేసిన వాహనాలలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎకక్కువగా ఉన్నాయని తెలిపారు.
Also Read : CM Chandrababu UAE Important Tour : యూఏఈలో సీఎం చంద్రబాబు పర్యటన



















