క‌ర్నూలులో కొలువు తీరిన క్యాంపా కోలా

అనంత‌పురంలో కియాకు ధీటుగా కంపెనీ

hellotelugu-CmapaCola

క‌ర్నూలు జిల్లా : ఏపీలోని అనంత‌పురం జిల్లాలో ఇప్ప‌టికే కొలువు తీరిన కియా కంపెనీకి ధీటుగా క‌ర్నూలు జిల్లాలో ఏర్పాటైంది ప్ర‌ముఖ రిల‌య‌న్స్ గ్రూప్ కు చెందిన క్యాంపా కోలా. ఒకప్పుడు భారతీయుల నాలుకపై ఆడిన ‘ది గ్రేట్ ఇండియన్ టేస్ట్’.. ఇప్పుడు ఓర్వకల్లు మట్టిలో ఇలా ప్రాణం పోసుకుంటోంది. బ్రాహ్మణపల్లి సమీపంలో 80 ఎకరాల సువిశాల సామ్రాజ్యంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ.1,622 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ క్యాంపా కోలా మెగా ప్లాంట్, ప్రపంచంలోనే అతిపెద్ద బెవరేజ్ హబ్స్‌లో ఒకటిగా నిలవబోతోంది.

దాదాపు 1,200 మందికి ప్రత్యక్షంగా, వేలమందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ.. సీమ బిడ్డల వలసలకు ఈ ప్రాజెక్ట్ శాశ్వత పరిష్కారం చూపబోతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఎర్రటి తివాచీ పరచడమే కాకుండా, ఏడాదికి దాదాపు రూ. 500 కోట్ల జిఎస్టీ రాబడితో రాష్ట్ర ఖజానాకు ఇది వెన్నుముకలా మారనుంది. ఇది రిలయన్స్ చేపడుతున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగా రూ. 768 కోట్లతో ఏర్పాటు చేయబోయే స్నాక్స్ , బిస్కెట్ల ఫుడ్ పార్క్ ద్వారా ఈ ప్రాంత సరఫరా వ్యవస్థను (Supply Chain) మరో స్థాయికి తీసుకెళ్లబోతోంది..

Exit mobile version