దుబాయ్ : ఐపీఎల్ మినీ వేలం 2026లో రికార్డ్ ధరకు అమ్ముడు పోయాడు కామెరాన్ గ్రీన్. ప్రస్తుతానికి తను టాప్ లో కొనసాగుతున్నాడు. ఏకంగా ఈ వేలం పాటలో రూ. 25.2 కోట్లకు తీసుకుంది కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజి. ఇది ఇప్పటి వరకు జరిగిన వేలం పాటల్లో టాప్ ధర. క్రికెట్ వర్గాలను సైతం విస్తు పోయేలా చేసింది. ఒక విదేశీ ఆటగాడిపై ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం చర్చకు దారి తీసింది. మరో వైపు టాప్ ప్లేయర్ గా పేరు పొందిన డేవిడ్ మిల్లర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ. 2 కోట్లకు తీసుకుంది. ఇది విస్మయానికి గురి చేసింది. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అనిల్ కుంబ్లే.
ఇక కామెరాన్ ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్ వంటి ఆటగాళ్లను కలిగి ఉంది . గ్రీన్ బ్యాటింగ్ ఓపెన్ చేయాలని లేదా నంబర్ 3 స్థానంలో ఆడాలని కుంబ్లే సూచించారు, సునీల్ నరైన్ దిగువ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి లేదా ఫ్లోటర్‌గా వ్యవహరించడానికి వీలు ఉందన్నాడు వేలం పాటలో దక్కించుకున్నాక .అజింక్య రహానేతో పాటు, యువ ఆటగాడు రఘువంశీతో కలిసి 3వ నంబర్‌లో ఓపెనింగ్ చేయగలడని ఆయన అన్నారు. ఇక వేలం పాటలో డేవిడ్ మిల్లర్ భారీ ధరకు అమ్ముడు పోతాడని అనుకున్నారంతా. కానీ ఊహించని రీతిలో తక్కువ ధరకే అమ్ముడు పోయాడు.



















